Narendra Modi: వైద్య రంగానికి రూ. 2 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం: మోదీ

Allocating Rs 2 lakhs for health sector says Modi

  • కరోనా సమయంలో వైద్యుల సేవలు అమోఘం
  • ప్రజలకు సేవలు అందించడానికి డిజటల్ ఇండియా పథకం దోహదపడింది
  • కో-విన్ యాప్ పై ఎన్నో దేశాలు ఆసక్తిని చూపుతున్నాయి

కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న సమయంలో వైద్యులు చేసిన సేవలు అమోఘమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ ఎంతో మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని చెప్పారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు సేవ చేశారని ప్రశంసించారు. వైద్య రంగం కోసం రూ. 2 లక్షల కోట్ల నిధులను కేటాయిస్తున్నట్టు చెప్పారు.

కరోనా సమయంలో లక్షలాది మందికి సేవలు అందించడానికి డిజిటల్ ఇండియా పథకం దోహదపడిందని మోదీ అన్నారు. ఈ పథకంలో భాగంగా అనేక పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ముఖ్యమైన డాక్యుమెంట్లను దాచుకోవడానికి డిజిలీకర్, కోవిడ్ ట్రేసింగ్ కోసం ఆరోగ్యసేతు వంటి యాప్ లను ప్రజల ముంగిటకు తీసుకొచ్చామని తెలిపారు. మన దేశం అమలు చేస్తున్న డిజిటల్ సొల్యూషన్స్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని అన్నారు.

కో-విన్ ఫ్టాట్ ఫామ్ ను అనుసరించేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గ్లోబల్ సెక్యూరిటీపై ఐక్యరాజ్యసమితి ఇచ్చిన ర్యాంకింగ్స్ లో మన దేశానికి పదో ర్యాంక్ వచ్చిందని తెలిపారు. భారత్ లో డేటా ప్రైవసీ పెరిగిందని చెప్పారు. విద్య నుంచి మందుల వరకు అన్నీ ఆన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

  • Loading...

More Telugu News