Sensex: మార్కెట్లకు ఈరోజు కూడా నష్టాలే
- అమ్మకాల ఒత్తిడికి గురైన ప్రధాన కంపెనీలు
- 164 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 41 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎస్ఫీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ వంటి బ్లూ చిప్ కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంలో సూచీలు డీలా పడ్డాయి. అయితే ఫార్మా, ఆటో షేర్లు కొంత మేర రాణించడంతో నష్టాలు కొంత మేర తగ్గాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 164 పాయింట్లు కోల్పోయి 52,318కి పడిపోయింది. నిఫ్టీ 41 పాయింట్లు పతనమై 15,680కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.56%), బజాజ్ ఆటో (1.84%), సన్ ఫార్మా (1.37%), ఏసియన్ పెయింట్స్ (1.08%), మారుతి సుజుకి (1.01%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-2.20%), ఇన్ఫోసిస్ (-1.32%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.02%), బజాజ్ ఫైనాన్స్ (-0.81%), హెచ్బీఎఫ్సీ బ్యాంక్ (-0.77%).