UAE: ఇండియన్ బుకీ నుంచి ముడుపులు.. ఇద్దరు యూఏఈ ఆటగాళ్లపై ఐసీసీ నిషేధం

Two UAE cricketers suspended on corruption charges

  • టీ20 ప్రపంచ కప్ సందర్భంగా ముడుపులు తీసుకున్నట్టు నిర్ధారణ
  • మిస్టర్ వై నుంచి 15 వేల యూఏఈ దిర్హామ్ ల చొప్పున స్వీకరించినట్టు వెల్లడి
  • బుకీతో వాట్సాప్ మెసేజ్ లు కూడా నడిచాయని నిర్ధారించిన ఐసీసీ

యూఏఈ క్రికెటర్లు అమీర్ హయత్, అష్ఫక్ అహ్మద్ లపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. భారత్ కు చెందిన బుకీ నుంచి ముడుపులు స్వీకరించారనే ఆరోపణలపై పూర్తి నిర్ధారణకు వచ్చిన ఐసీసీ... వీరిద్దరిపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. 2019లో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీ క్వాలిఫయర్ లో వీరు ముడుపులు స్వీకరించారని ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రైబ్యునల్ నిర్ధారించింది. దీంతో, వీరిపై ఐసీసీ వేటు వేసింది.

వీరిద్దరూ 15 వేల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ లను బుకీ నుంచి స్వీకరించారని ఐసీసీ నిర్ధారించింది. క్వాలిఫయింగ్ రౌండ్ గేమ్స్ ను ఫిక్స్ చేసేందుకు మిస్టర్ 'వై' అనే వ్యక్తి నుంచి డబ్బు తీసుకున్నారని విచారణలో తేలింది. వీరిద్దరిలో అహ్మద్ బ్యాట్స్ మెన్ కాగా... హయత్ మీడియం పేస్ బౌలర్. మిస్టర్ వైకి బెట్టింగ్ సిండికేట్లతో లింకులు ఉన్నట్టు యాంటీ కరప్షన్ ట్రైబ్యునల్ తెలిపింది. ఆయనతో ఈ ఇద్దరు క్రికెటర్లకు వాట్సాప్ మెసేజ్ లు కూడా నడిచాయని చెప్పింది.

  • Loading...

More Telugu News