Drone: అలాంటి దాడులను అరికట్టే యాంటీ-డ్రోన్ వ్య‌వ‌స్థ మ‌న వ‌ద్ద ఉంది: డీఆర్డీవో

 Our anti drone technology can prevent attacks says drdo

  • డీఆర్డీవో డీ-4 యాంటీ-డ్రోన్ వ్య‌వ‌స్థతో డ్రోన్లను గుర్తించ‌వ‌చ్చు
  • వీటిలో మల్టిపుల్ సెన్సార్లు, రెండు వేర్వేరు కౌంట‌ర్అటాక్ సామ‌ర్థ్యాలు ఉంటాయి
  • డ్రోన్ల దాడిని ముందుగా ప‌సిగ‌డితేనే వాటి దాడి నుంచి త‌ప్పించుకోగ‌లుగుతాం
  •  మైక్రో డ్రోన్ల‌ను సైతం ప‌సిగ‌ట్టి ధ్వంసం చేయ‌గ‌ల‌దు

జ‌మ్మూక‌శ్మీర్‌లోకి డ్రోన్లు పంపుతూ పాకిస్థాన్ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో డ్రోన్ల పీచ‌మ‌ణిచే వ్య‌వ‌స్థ‌పై భార‌త ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. ఇజ్రాయెల్ నుంచి యాంటీ-డ్రోన్ వ్య‌వ‌స్థ‌ల‌ను దిగుమ‌తి చేసుకోవాల‌ని బావిస్తోంది. డ్రోన్ల‌పై ఆటోమెటిక్‌గా దాడి చేసే వ్య‌వ‌స్థ ఇప్పుడు భార‌త్‌కు అత్యవసరంగా మారింది.

ఈ నేప‌థ్యంలో యాంటీ-డ్రోన్ వ్య‌వ‌స్థ‌ల గురించి భార‌త ర‌క్ష‌ణ‌, ప‌రిశోధ‌న సంస్థ‌ (డీఆర్డీవో) ఎల‌క్ట్రానిక్స్, క‌మ్యూనికేష‌న్ సిస్ట‌మ్స్ (ఈసీఎస్) డైరెక్ట‌ర్ జ‌న‌రల్ జిల్లెళ్ల‌మూడి మంజుల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తాము ఇప్ప‌టికే అభివృద్ధి చేసిన డీ-4 యాంటీ-డ్రోన్ వ్య‌వ‌స్థ వ‌ల్ల శ‌త్రు డ్రోన్ల‌ను నాశ‌నం చేయవ‌చ్చ‌ని తెలిపారు.

'ఇటీవ‌ల జ‌మ్మూక‌శ్మీర్‌లోని విమానాశ్ర‌యంలో జ‌రిగిన డ్రోన్ల దాడి వంటి వాటిని డీ-4 డ్రోన్ వ్య‌వ‌స్థ ద్వారా ముందుగానే గుర్తించ‌వ‌చ్చు. దాదాపు 4 కిలోమీట‌ర్ల కంటే త‌క్కువ దూరంలో సంచ‌రిస్తోన్న డ్రోన్ల‌ను డీ-4 డ్రోన్ వ్య‌వ‌స్థ ప‌సిగ‌ట్టి వాటిని కూల్చివేస్తుంది. ఈ డీ-4 డ్రోన్ వ్య‌వ‌స్థ‌లో మల్టిపుల్ సెన్సార్లు, రెండు వేర్వేరు కౌంట‌ర్అటాక్ సామ‌ర్థ్యాలు ఉంటాయి' అని ఆమె వివ‌రించారు.

'డ్రోన్ల దాడిని ముందుగా ప‌సిగ‌డితేనే వాటి దాడి నుంచి త‌ప్పించుకోగ‌లుగుతాం. కాబ‌ట్టి ముప్పు ఉన్న ప్రాంతాల్లో భారీగా డీ-4 డ్రోన్‌ వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ల వ్య‌వ‌స్థ‌ల‌ను ఢిల్లీలోని రాజ్‌ప‌థ్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో భాగంగా వాడారు. అనుమానాస్ప‌ద కార్య‌కలాపాలు, డ్రోన్ల‌పై ఆ స‌మ‌యంలో ఏడు రోజుల పాటు పూర్తిస్థాయిలో నిఘా పెట్టాము. అదృష్ట‌వ‌శాత్తూ ఎలాంటి అనుమానాస్పద కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌లేదు' అని ఆమె తెలిపారు. ఈ డీ-4 డ్రోన్ల వ్య‌వ‌స్థ మైక్రో డ్రోన్ల‌ను సైతం ప‌సిగ‌ట్టి వాటి క‌మాండ్, కంట్రోల్ లింకుల‌ను జామ్ చేసి డ్రోన్ల‌ను ధ్వంసం చేయ‌గ‌ల‌ద‌ని ఆమె వివ‌రించారు.

  • Loading...

More Telugu News