Gandhi Bhavan: రేవంత్ కు పీసీసీ పదవి నేపథ్యంలో గాంధీ భవన్ కు కొత్త వాస్తు!

Changes for Gandhi Bhavan after Revanth Reddy appointed as TPCC chief

  • టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి
  • జులై 7న పదవీ బాధ్యతల స్వీకారం
  • గాంధీ భవన్ ను పరిశీలించిన వాస్తు నిపుణులు!
  • వారి సూచనలతో మార్పులు చేర్పులు!

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించిన నేపథ్యంలో, గాంధీ భవన్ లో పలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా, వాస్తు సిద్ధాంతం ప్రకారం ఈ కొత్త మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

దీని ప్రకారం... గాంధీభవన్ లో కాంగ్రెస్ పతాకాలు విక్రయించే గదితో పాటు, భద్రతా సిబ్బంది గదిని కూడా తొలగించనున్నారు. ఈశాన్యం వైపున ఖాళీగా ఉంచాలన్నది కొత్త పీసీసీ నేతల ఆలోచన! అంతేకాదు, ఆవరణలో గాంధీ విగ్రహం మినహా మరే నిర్మాణాలు ఉండరాదని నేతలు భావిస్తున్నారు. రేవంత్ పీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో పాత గేటు నుంచి వచ్చి, కార్యక్రమం అనంతరం కొత్త గేటు ద్వారా బయటికి వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాగా, రేవంత్ రెడ్డి జులై 7న గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోబోతున్నారు. ఈ లోపే మార్పులు పూర్తిచేయనున్నారు. ఇప్పటికే కొందరు వాస్తు నిపుణులు గాంధీభవన్ ను పరిశీలించగా, వారి సూచనల మేరకే తాజా మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News