Cinematography: సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణల ముసాయిదాపై సినీ సంఘాల అభ్యంతరం

Cine associations abjects over cinematography amendments

  • సవరణలతో జాతీయ సినిమాటోగ్రఫీ చట్టం
  • కేంద్రానికి విశేషాధికారం
  • సీబీఎఫ్ సీ పరిశీలన తర్వాత కూడా కేంద్రం పరిశీలించే అధికారం
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న 6 సంఘాలు

జాతీయసినిమాటోగ్రఫీ చట్టం-2021లో సవరణల ముసాయిదాపై సినిమా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 6 సినిమా సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి తమ అభ్యంతరాలు తెలియజేశాయి. కేంద్రం ప్రతిపాదించే బిల్లు సినీ పరిశ్రమకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆయా సినీ సంఘాలు అభిప్రాయపడ్డాయి. కేంద్రం బిల్లు భావప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నాయి. అన్ని అధికారాలు సీబీఎఫ్ సీ వద్దే ఉండాలని సినీ సంఘాలు సూచించాయి.

కాగా, కేంద్రం తీసుకువస్తున్న ఈ బిల్లుపై జాతీయస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సవరణలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో ఇప్పటికే కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ సవరణలు దర్శకనిర్మాతల సృజనశీలతను అణచివేసేలా ఉన్నాయని పేర్కొంది.

దీనిపై ప్రముఖ నటుడు కమలహాసన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత కూడా, ఓ సినిమాను సమీక్షించే అధికారం ఈ చట్టం ద్వారా కేంద్రానికి లభిస్తుందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన నిన్న స్పష్టం చేశారు.

ఇప్పటివరకు సినిమాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేసేది. అయితే కేంద్రం తీసుకువస్తున్న నూతన చట్టం ద్వారా... సీబీఎఫ్ సీ పరిశీలించిన చిత్రాలను కూడా కేంద్రం మళ్లీ పరిశీలించి వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం లభిస్తుంది.

  • Loading...

More Telugu News