Apps: ఈ 9 ఆండ్రాయిడ్ యాప్ లతో బహుపరాక్!

Doctor Web alerts users nine harmful android apps
  • యూజర్లను అప్రమత్తం చేసిన డాక్టర్ వెబ్ సంస్థ
  • గతంలో గూగుల్ ప్లే స్టోర్ లో ఈ 9 యాప్ లు
  • యాప్ లపై ఫిర్యాదులు
  • ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్
  • ఫోన్లలో ఉంటే తొలగించాలన్న డాక్టర్ వెబ్
తెల్లగా కనిపించేవన్నీ పాలు కాదు, నల్లగా కనిపించేవన్నీ నీళ్లు కాదు అన్నట్టు... గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే ఆండ్రాయిడ్ యాప్ లన్నీ మంచివే అనుకోవడానికి వీల్లేదు. డాక్టర్ వెబ్ అనే మాల్వేర్ విశ్లేషణ సంస్థ కొన్ని ఆండ్రాయిడ్ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది.

ముఖ్యంగా, 9 యాప్ లు యూజర్ల పాలిట ప్రమాదకారులని వెల్లడించింది. ఇవి గతంలో గూగుల్ ప్లే స్టోర్ లో ఉండేవని, అయితే వాటిపై ఫిర్యాదులు రావడంతో గూగుల్ వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు కూడా తమ ఫోన్లలో ఈ 9 యాప్ లలో ఏది ఉన్నా జాగ్రత్తపడాలని డాక్టర్ వెబ్ హెచ్చరించింది.

ఇవి ప్రధానంగా ట్రోజన్ వైరస్ తరహా యాప్ లని, చూడ్డానికి సాధారణంగా కనిపించే కొన్ని లింకుల సాయంతో ప్రమాదకరమైన కొన్ని జావా స్క్రిప్టులను చొప్పించి, యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తాయని సదరు సంస్థ వెల్లడించింది. అనంతరం ఆ సమాచారాన్ని సదరు యాప్ లు సైబర్ నేరగాళ్ల సర్వర్ లకు చేరవేస్తాయని వివరించింది.

ఆ 9 యాప్ లు ఏవంటే...

  • పీఐపీ ఫొటో (PIP Photo)
  • ప్రాసెసింగ్ ఫొటో (Processing Photo)
  • రబ్బిష్ క్లీనర్ (Rubbish Cleaner)
  • హారోస్కోప్ డైలీ (Horoscope Daily)
  • ఇన్ వెల్ ఫిట్ నెస్ (Inwell Fitness)
  • యాప్ లాక్ కీప్ (App Lock Keep)
  • లాక్ ఇట్ మాస్టర్ (Lockit Master)
  • హారోస్కోప్ పై (Horoscope Pi)
  • యాప్ లాక్ మేనేజర్ (App Lock Manager)


Apps
Android
Doctor Web
Google
Play Store

More Telugu News