Ramyakrishna: వనిత విజయ్ కుమార్ వ్యాఖ్యలను తేలిగ్గా తీసిపారేసిన రమ్యకృష్ణ!

Ramyakrishna responds to Vanitha Vijaykumar allegations
  • టీవీ షో నుంచి తప్పుకున్న వనిత
  • ఓ సీనియర్ నటి కారణంగానే అని వెల్లడి
  • ఈ కార్యక్రమానికి రమ్యకృష్ణ హోస్ట్
  • వనితకు 10కి 1 మార్కు ఇచ్చిన రమ్య
తమిళ నటి వనితా విజయ్ కుమార్ కు వివాదాలు కొత్తకాదు. వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆమె కొంతకాలంగా బుల్లితెరకే పరిమితమైపోయింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న వనిత, ఆపై కుక్ విత్ కోమలి, కళక్క పావదు యారు అనే కార్యక్రమాలతో అలరించింది. తాజాగా బిగ్ బాస్ జోడిగళ్ అనే రియాల్టీ షోలో పాల్గొంది. అయితే అనూహ్యరీతిలో వనిత ఈ షో నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేసింది. ఓ సీనియర్ నటి కారణంగానే తాను ఈ షో నుంచి వైదొలగాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

కాగా, బిగ్ బాస్ జోడిగళ్ కార్యక్రమానికి సీనియర్ నటి రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. వనిత చేసిన వ్యాఖ్యలు రమ్యకృష్ణను ఉద్దేశించినవేనని భావిస్తున్నారు. ఈ షోలో ఓ ఎపిసోడ్ లో వనిత పెర్ఫార్మెన్స్ కు రమ్యకృష్ణ 10 మార్కులకు గాను కేవలం ఒక మార్కు ఇచ్చింది. ఇక వనిత వ్యవహారాన్ని రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించగా... ఇదేమంత పెద్ద విషయం కాదని  పేర్కొంది. అయినా, ఆ షోలో ఏం జరిగిందో ఆమెను కూడా అడగాల్సింది అని మీడియాకు సూచించింది..
Ramyakrishna
Vanitha Vijaykumar
BBJodigal
Tamilnadu

More Telugu News