CPI Narayana: కృష్ణా జలాల వివాదాన్ని భలేగా వాడుకుంటున్నారు: జగన్, కేసీఆర్‌పై సీపీఐ నారాయణ ఫైర్

CPI Narayana Fires on AP and Telangana Cms

  • ప్రతి సమస్యను కృష్ణా జలాలతో ముడిపెడుతున్నారు
  • కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి
  • దేశాల సరిహద్దులను తలపిస్తున్న రాష్ట్ర సరిహద్దులు

ఏపీ, తెలంగాణ మధ్య ఏ సమస్య వచ్చినా దానిని కృష్ణా జలాలతో ముడిపెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌ ఎవరికి వారే ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలని, తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.

కృష్ణా జలాల వినియోగంపై ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై ట్రైబ్యునల్‌ను కేసీఆర్ ప్రశ్నిస్తే.. జగన్‌మోహన్‌రెడ్డి కోర్టులు, ఎన్నికల కమిషన్లను ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారని విమర్శించారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల వద్ద పోలీసుల మోహరింపును చూస్తుంటే దేశాల సరిహద్దులు గుర్తొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News