Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 395 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 112 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా పుంజుకున్న ఎస్బీఐ షేరు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలతో ఇన్వెస్టర్లు ఈరోజు హుషారుగా ట్రేడింగ్ చేశారు. దీంతో మార్కెట్లు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 52,880కి చేరుకుంది. నిఫ్టీ 112 పాయింట్లు పెరిగి 15,834కి ఎగబాకింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.16%), టాటా స్టీల్ (2.07%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.38%), ఎల్ అండీ టీ (1.35%), యాక్సిస్ బ్యాంక్ (1.26%).
 
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.51%), డాక్టర్ రెడ్డీస్ (-0.63%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.50%), టైటాన్ కంపెనీ (-0.20%), భారతి ఎయిర్ టెల్ (-0.10%).

  • Loading...

More Telugu News