Telangana: ఎన్జీటీలో ఏపీ సర్కారుపై ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
- రాయలసీమ ఎత్తిపోతల నేపథ్యంలో ఫిర్యాదు
- ఎన్జీటీని ఆశ్రయించిన తెలంగాణ
- ఏపీ నిబంధనలు పాటించడంలేదని ఆరోపణ
- ఎన్జీటీ బృందం పర్యటించాలని విజ్ఞప్తి
- హెలికాప్టర్ సమకూర్చుతామని వెల్లడి
ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతున్న జల వివాదాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఏపీ సర్కారుపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
ప్రాజెక్టుల సందర్శనకు వచ్చే అధికారులను ఏపీ అడ్డుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఎన్జీటీ బృందం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించాలని విజ్ఞప్తి చేసింది. ఎన్జీటీ బృందం పర్యటనకు అన్ని వసతులు కల్పిస్తామని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఎన్జీటీ బృందానికి హెలికాప్టర్ తో పాటు, ఇతర వాహనాలు కూడా సమకూర్చుతామని పేర్కొంది.