Telangana: మందుబాబులకు శుభవార్త... బీరు ధరలు తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana govt drops beer price ten rupees for one bottle

  • బీరు సీసాపై రూ.10 తగ్గింపు
  • గతంలో రూ.30 సెస్ విధించిన తెలంగాణ సర్కారు
  • అన్ని బ్రాండ్లకు వర్తించేలా తగ్గింపు
  • ఉత్తర్వులు జారీ

తెలంగాణ ఆబ్కారీ శాఖ మందుబాబులకు శుభవార్త చెప్పింది. బీరు ధరపై 10 రూపాయలు తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ తగ్గింపు అన్ని బ్రాండ్ల బీర్లకు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటిదాకా ఎక్సైజ్ సుంకం పేరిట సీసా ఒక్కింటికి రూ.30 అదనంగా వసూలు చేశారు. ఇప్పుడా ప్రత్యేక సెస్ నుంచి రూ.10 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. తగ్గింపు నేటి నుంచే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ వెల్లడించింది.

కాగా, ఇప్పటికిప్పుడు తెలంగాణ సర్కారు బీర్ల ధర తగ్గించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సాధారణంగా బీర్లకు వేసవిలో అత్యధిక డిమాండ్ ఉంటుంది. ఎండలు తగ్గడంతో బీర్లకు కూడా డిమాండ్ తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే బీర్ల ధరలు తగ్గించి ఉంటారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News