CBSE: ఇక రెండు భాగాలుగా సీబీఎస్ఈ విద్యా సంవత్సరం
- నోటిఫికేషన్ జారీ
- 2021-22 విద్యాసంవత్సరం నుంచి రెండు టర్మ్ లు
- ఒక్కో టర్మ్ కు 50 శాతం సిలబస్
- పరీక్షల నిర్వహణ సులువవుతుందని భావన
సీబీఎస్ఈ 2021-22 విద్యాసంవత్సరానికి గాను కొత్త స్కీమ్ అమలు చేయనుంది. ఇకపై విద్యాసంవత్సరాన్ని రెండు భాగాలు విభజిస్తారు. తొలి టర్మ్ లో 50 శాతం సిలబస్, మలి టర్మ్ లో 50 శాతం సిలబస్ తో విద్యాసంవత్సరం కొనసాగుతుంది. ప్రథమార్థం పరీక్షలు నవంబరులో నిర్వహిస్తారు. ఈ మేరకు సీబీఎస్ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధానం ద్వారా 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సాధ్యపడుతుందని సీబీఎస్ఈ భావిస్తోంది. రెండు టర్మ్ లు ఉండడం వల్ల పరీక్షల నిర్వహణ సులువు అవుతుందన్న కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, సిలబస్ లో పెద్దగా మార్పులు ఉండబోవని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.