Sensex: ఒడిదుడుకుల మధ్య స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Markets ends with losess

  • 18 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 16 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా నష్టపోయిన టెక్ మహీంద్రా

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ రోజు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు నిమిషాల వ్యవధిలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం లాభాల్లోకి మళ్లాయి. అయితే చివర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో స్వల్ప నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 18 పాయింట్ల నష్టంతో 52,861కి దిగింది. నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 15,818 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.00%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.40%), బజాజ్ ఫైనాన్స్ (2.10%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.38%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.07%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.27%), టీసీఎస్ (-1.46%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.35%), మారుతి సుజుకి (-1.26%), సన్ ఫార్మా (-1.16%).

  • Loading...

More Telugu News