Raghu Rama Krishna Raju: జగన్ కు ఎంపీ రఘురామకృష్ణ రాజు మరో లేఖ!
- ఐటీ చట్టం సెక్షన్ 66ఏ కింద పోలీసు కేసుల నమోదు వద్దు
- సామాజిక మాధ్యమాల కార్యకలాపాలపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారు
- నా ఫొటోను ఎవరైనా వాడినా వారిపై కేసులు పెడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఎంపీ రఘురామకృష్ణ రాజు 'నవ సూచనలు (వినమ్రతతో)' పేరుతో ఈ రోజు తొమ్మిదో లేఖ రాశారు. ఐటీ చట్టం సెక్షన్ 66ఏ కింద పోలీసు కేసుల నమోదును ఆపాలని ఆయన కోరారు. ఎందుకంటే ఆ చట్టం ద్వారా.. సామాజిక మాధ్యమాల కార్యకలాపాలపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
నిజానికి ఈ చట్టాన్ని 2015లోనే సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ పోలీసులు ఆ సెక్షన్‌పైనే కేసులు నమోదు చేయడంపై ఇటీవల సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చిందని తెలిపారు. ఎవరైనా తన ఫొటోను వారి ఫోన్‌లో డిస్ ప్లే చేస్తే లేదా మెసేజింగ్ యాప్‌లలో వాడుకుంటే వారిని పోలీసు స్టేషన్ లకు పిలుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడకుండా చూసుకోవాలని ఆయన కోరారు.