Danam Nagender: దానం నాగేందర్ కు 6 నెలల జైలు శిక్షను విధించిన కోర్టు

Six months imprisonment for TRS MLA Danam Nagender
  • 2013 నాటి కేసులో శిక్ష విధించిన కోర్టు
  • ఓ వ్యక్తిపై దాడి చేసినట్టు నిర్ధారణ
  • పైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించిన కోర్టు
టీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ మరియు ఎమ్మెల్యేల స్పెషల్ సెషన్స్ కోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించింది. బంజారాహిల్స్ లో 2013లో నమోదైన కేసులో దానంను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారనే అభియోగాలు రుజువు కావడంతో దానంతో పాటు మరో వ్యక్తికి కోర్టు శిక్షను విధించింది. అయితే పైకోర్టుకు అప్పీలుకు వెళ్లేందుకు అనుమతించింది. శిక్ష అమలును నెల రోజుల పాటు వాయిదా వేసింది.
Danam Nagender
TRS
Court
Imprisonment

More Telugu News