Gorantla Butchaiah Chowdary: ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు లేవనే విషయం అర్థమయింది!: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Chowdary slams BJP for not giving a chance for AP in cabinet expansion

  • కేంద్ర కేబినెట్ విస్తరణలో ఏపీకి మొండిచెయ్యి
  • నిజంగా న్యాయం చేయాలనే తపన లేకపోవడం శోచనీయం  
  • ఎన్నికలు వస్తే తప్ప బీజేపీ మన వైపు చూడదని వ్యాఖ్య

నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించగా... ఏపీకి చెందిన బీజేపీ నేతలకు కనీసం సహాయ మంత్రి అవకాశం కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు.

'ఓహో... అదిరిందయ్యా పుష్పములు. ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు లేవనే విషయం అర్థమయింది' అని గోరంట్ల ట్వీట్ చేశారు. కేవలం ఎన్నికలు, ఎంపీ సీట్లు, ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప... తెలుగు ప్రజలకి నిజంగా న్యాయం చేయాలనే తపన కేంద్ర ప్రభుత్వాలకు లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మధ్యంతర ఎన్నికలు వస్తే తప్ప బీజేపీ మన వైపు చూడదన్నమాట అని విమర్శించారు.

  • Loading...

More Telugu News