Sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- 485 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 151 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2 శాతానికి పైగా నష్టపోయిన టాటా స్టీల్ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం ఇన్వెస్టర్లపై ప్రభావాన్ని చూపింది. దీనికి తోడు చైనా టెక్ సెక్టార్ దెబ్బతినబోతోందనే ఆందోళనలు మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. దీంతో ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత సూచీలు మళ్లీ కోలుకోలేదు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 485 పాయింట్లు పతనమై 52,568కి పడిపోయింది. నిఫ్టీ 151 పాయింట్లు కోల్పోయి 15,727కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (1.44%), బజాజ్ ఆటో (0.62%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.15%), హెచ్సీఎల్ (0.06%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.04%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.36%), సన్ ఫార్మా (-1.89%), డాక్టర్ రెడ్డీస్ (-1.82%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.74%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.68%).