KRMB: రేపు జరగాల్సిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా

KRMB three member committee meet postponed

  • మరింత ముదిరిన ఏపీ, తెలంగాణ జలవివాదాలు
  • ఇటీవల కేఆర్ఎంబీకి లేఖ రాసిన తెలంగాణ
  • త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా వేయాలని వినతి
  • అజెండాలో తమ అంశాలు లేవని ఆరోపణ

ఏపీతో జలవివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేఆర్ఎంబీ (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలంటూ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో, రేపు జరగాల్సిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. సమావేశం ఎప్పుడు జరిగేది త్వరలో ప్రకటిస్తామని కేఆర్ఎంబీ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు మరింత ముదిరిన నేపథ్యంలో, ఈ కీలక భేటీ వాయిదా పడడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది. త్రిసభ్య కమిటీ అజెండాలో తమకు సంబంధించిన అంశాలు లేవని, తమ అంశాలతో ఈ నెల 20 తర్వాత సమావేశం నిర్వహించాలని కోరింది. విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోందని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు.

  • Loading...

More Telugu News