Third Wawe: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో థర్డ్ వేవ్: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు
- డెల్టా వేరియంట్ ప్రభావం విదేశాల్లో ఎక్కువగా ఉంది
- ఈ ఏడాది రాష్ట్రంలో థర్డ్ వేవ్ ఉండదు
- తీవ్ర ప్రభావం చూపిన తర్వాత వచ్చే వైరస్లు బలహీనంగా ఉంటాయి
మన దేశంలో వెలుగు చూసిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఇప్పుడు విదేశాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు అన్నారు. వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిన తర్వాత పుట్టే కొత్త వైరస్లు బలహీనంగా ఉంటాయని పేర్కొన్నారు. కాబట్టి వాటి ప్రభావం అంతంత మాత్రమేనని అన్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి తెలంగాణలో మూడో దశ వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉద్ధృతి కనిపించినా దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని, కాబట్టి థర్డ్ వేవ్‌పై ఆందోళన అవసరం లేదన్నారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు.