Whatsapp: నూతన గోప్యతా విధానాలను బలవంతంగా రుద్దం: ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన వాట్సాప్​

We dont Enforce new privacy policies on users says Whatsapp
  • ఇప్పటికే చాలా మంది అంగీకరించారు
  • ఒప్పుకోని వారి ఖాతాలను బ్లాక్ చేయట్లేదు
  • అయితే అప్ డేట్ కనిపిస్తూనే ఉంటుంది
పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు చట్టంగా మారేంత వరకు కొత్త గోప్యతా విధానాలను వినియోగదారులపై బలవంతంగా రుద్దబోమని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ తెలిపింది. ఆ విధానాలను ప్రస్తుతానికి పక్కనపెట్టినట్టు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ డి.ఎన్. పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ల ధర్మాసనం ముందు వాట్సాప్, ఫేస్ బుక్ ల తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.

ఇప్పటికే ప్రైవసీ పాలసీని చాలా మంది ఆమోదించారని చెప్పారు. బిల్లు పాసయ్యి అందులోని విషయాలు తమకు అనుకూలంగా ఉంటే అప్పుడు ప్రైవసీ పాలసీని అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి వినియోగదారులను ఈ విషయంలో ఇబ్బంది పెట్టట్లేదని, విధానాలకు అంగీకరించని వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే, యూజర్లకు మాత్రం ప్రైవసీ పాలసీకి సంబంధించిన అప్ డేట్ మాత్రం కనిపిస్తూనే ఉంటుందని చెప్పారు.

కొత్త ప్రైవసీ పాలసీపై దర్యాప్తు చేయాల్సిందిగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించడాన్ని తప్పుపడుతూ వాట్సాప్, ఫేస్ బుక్ లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే, సంస్థల విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ రెండు సంస్థలు మరో పిటిషన్ వేశాయి. ఆ పిటిషన్ విచారణ సందర్భంగానే వాట్సాప్ ఈ వ్యాఖ్యలు చేసింది.
Whatsapp
New Delhi
High Court
Privacy Policies

More Telugu News