Mohan Babu: అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు.. చర్యలు తీసుకోండి: పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు

Mohan Babu files complaint with Cyber Crime Police
  • ఓ యూట్యూబ్ ఛానల్ టార్గెట్ చేసిందని ఫిర్యాదు
  • బూతులతో కామెంట్లు పెడుతున్నారన్న మోహన్ బాబు 
  • కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
తనను వ్యక్తిగతంగా కొందరు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో తనను ట్రోల్ చేస్తూ దూషిస్తున్నారంటూ హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వ్యక్తిగతంగా తిడుతుండటమే కాకుండా... అసభ్యకరమైన బూతులతో కామెంట్ల రూపంలో, వీడియోల రూపంలో పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మోహన్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు. మోహన్ బాబు తరపున ఆయన లీగల్ అడ్వైజర్ సంజయ్ పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు. పొలిటికల్ మోజో అనే పేరు గల యూట్యూబ్ ఛానల్ మోహన్ బాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని ఆయన తెలిపారు.
Mohan Babu
Tollywood
Social Media
Youtube Channel
Troll

More Telugu News