Mandali Buddaprasad: సీఎం జగన్ తెలుగు అకాడమీ చరిత్ర తెలుసుకోవాలి: మండలి బుద్ధప్రసాద్

Mandali Buddha Prasad reacts after govt changed Telugu Academy name
  • తెలుగు అకాడెమీ పేరుమార్చిన ఏపీ సర్కారు
  • తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్పు
  • ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
  • విచారకరమన్న మండలి బుద్ధప్రసాద్
తెలుగు అకాడెమీ పేరును తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్చుతూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ దీనిపై ధ్వజమెత్తారు. తాజాగా తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ కూడా తన గళం వినిపించారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం విచారకరం అని పేర్కొన్నారు. తెలుగు అకాడెమీలో సంస్కృత విభాగాన్ని కూడా కలపడం భావ్యం కాదని అన్నారు.

సీఎం జగన్ తెలుగు అకాడెమీ చరిత్ర తెలుసుకోవాలని మండలి బుద్ధప్రసాద్ హితవు పలికారు. మాతృభాషను గౌరవించడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం అని, తెలుగు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరించడం మంచిది కాదని స్పష్టం చేశారు. కావాలనుకుంటే సంస్కృతానికి ప్రత్యేకంగా ఓ అకాడెమీ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.
Mandali Buddaprasad
Telugu Academy
Name
YSRCP
Andhra Pradesh

More Telugu News