Uttar Pradesh: జనాభా నియంత్రణ చట్టాన్ని విడుదల చేసిన యూపీ
- 2030 నాటికి 1.9 సంతాన రేటు లక్ష్యం
- 2026 నాటికి 2.1కి తగ్గించాలని సంకల్పం
- అభివృద్ధికి జనాభా అవరోధమన్న సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ చట్టాన్ని విడుదల చేసింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021–2030కి గానూ ఆ చట్టాన్ని విడుదల చేశారు.
ప్రస్తుతం రాష్ట్ర సంతాన రేటు 2.7 శాతం ఉండగా 2030 నాటికి సంతాన రేటును 1.9కి తీసుకురావాలన్న లక్ష్యాన్ని అందులో నిర్దేశించారు. 2026 నాటికి 2.1 శాతానికి తీసుకురావాలని తలపెట్టారు. పెరుగుతున్న జనాభాతో రాష్ట్రంతో పాటు దేశాభివృద్ధికి అవరోధం ఏర్పడుతుందని ఆయన అన్నారు. పెరుగుతున్న పేదరికానికి జనాభా పెరుగుదలే కారణమన్నారు. ప్రతి ఒక్కరూ, ప్రతి వర్గమూ కొత్త జనాభా చట్టాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఈ చట్టంపై 2018 నుంచి కసరత్తులు చేస్తున్నామని ఆయన వివరించారు.
ఇప్పటికే ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా ప్రతిని రాష్ట్ర న్యాయశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో మార్పుచేర్పుల కోసం సలహాలు, సూచనలకు ఈ నెల 19 వరకు గడువిచ్చింది.