DK Shivakumar: నేను గట్టిగా కొట్టలేదు... అయినా అతడు మావాడే: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్

Karnataka Congress Chief DK Shivakumar explains Mandya incident
  • ఇటీవల మాండ్యాలో శివకుమార్ పర్యటన
  • చనువుగా ప్రవర్తించిన కార్యకర్త
  • తలపై ఒక్కటిచ్చుకున్న శివకుమార్
  • విపక్షాల నుంచి విమర్శలు
  • వివరణ ఇచ్చిన డీకే
ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాండ్యాలో ఓ కార్యకర్తపై చేయిచేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై శివకుమార్ వివరణ ఇచ్చారు. తాను కొట్టింది తన దూరపు బంధువునే అని, తామిద్దరి మధ్య చనువు ఉందని వెల్లడించారు. అతడు తమ ఇంటి మనిషిలాంటి వాడేనని తెలిపారు.

ఎప్పుడైనా అతడు తనను తిడితే భరిస్తానని, తాను అతడ్ని తిట్టినా అతడు కూడా భరిస్తాడని, తమ మధ్య అంతటి సఖ్యత ఉందని వివరించారు. కానీ, పబ్లిక్ లో నడుస్తున్నప్పుడు నడుం చుట్టూ చేయి వేసే ప్రయత్నం చేసే సరికి సహనం కోల్పోయానని డీకే శివకుమార్ తెలిపారు. అప్పటికీ తాను అతడ్ని గట్టిగా కొట్టలేదని, ఓ మోస్తరుగా కొట్టానని వివరణ ఇచ్చారు.
DK Shivakumar
Mandya
Slap
Congress Worker
Karnataka

More Telugu News