Kamaal R Khan: ప్రియాంక చోప్రా పెళ్లి పెటాకులవుతుందన్న సినీ క్రిటిక్... తిట్టిపోస్తున్న నెటిజన్లు

Kamaal R Khan predicts Priyanka and Nick divorce in future
  • కమాల్ ఆర్ ఖాన్ వ్యాఖ్యలు
  • పదేళ్లలో ప్రియాంక, నిక్ విడాకులు తీసుకుంటారని వెల్లడి
  • కరీనా పిల్లలు తారలుగా రాణించలేరని వివరణ
  • ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
తనను తాను సినీ విమర్శకుడిగా చెప్పుకునే కమాల్ ఆర్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అతడు స్వయంగా చెప్పుకుంటే తప్ప... గతంలో బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో కూడా నటించిన సంగతి, కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సంగతి చాలామందికి తెలియదు. ప్రస్తుతం తనకు తోచిన రీతిలో సినీ రివ్యూలు ఇస్తూ, అగ్రహీరోల అభిమానుల ఆగ్రహానికి గురవుతుండడం కమాల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే కు ఓ అలవాటుగా మారింది.

తాజాగా, ప్రియాంక చోప్రాపై అతడు చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పించాయి. మరో పదేళ్లలో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ల కాపురం విచ్ఛిన్నం అవుతుందని, వారు విడాకులు తీసుకోవడం ఖాయమని కేఆర్కే వెల్లడించాడు. దాంతో నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా ఆ సినీ క్రిటిక్ పై తమ ఆగ్రహావేశాలు వెలిబుచ్చారు.

కేఆర్కే పైత్యం అంతటితో ఆగలేదు... కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ సంతానంపైనా తన జోస్యం వెల్లడించాడు. కరీనా, సైఫ్ పిల్లలు తైమూర్, జే భవిష్యత్తులో నటులుగా ఏమాత్రం రాణించలేరని పేర్కొన్నాడు. వారి పేర్లలోనే తప్పు ఉందని, అందుకే వారు సినీ రంగంలో ఎదగలేరని వివరించాడు.
Kamaal R Khan
Priyanka Chopra
Nick Jonas
Divorce
Prediction

More Telugu News