Telangana: కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటా: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
- మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- రాష్ట్రంలో నాయకత్వ లోపం కారణంగా కాంగ్రెస్ బలహీనం
- రేవంత్రెడ్డి ఎంపికపై మాట్లాడదలచుకోలేదు
కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాల ఆధారంగా, కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పలు గ్రామాల్లో నిన్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ మార్పు వార్తలపై స్పందించారు. తనకు ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన లేదన్నారు. అయితే, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలపై తన భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రంలో నాయకత్వ లోపం కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయ లోపం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బలహీనపడగా, బీజేపీ పుంజుకుందన్నారు. రేవంత్ రెడ్డి ఎంపికపై తాను మాట్లాడబోనని రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు.