Yashpal Sharma: ప్రముఖ క్రికెటర్ యశ్ పాల్ శర్మ కన్నుమూత

Yashpal Sharma Dies Of Cardiac Arrest

  • కార్డియాక్ అరెస్ట్ తో యశ్ పాల్ మృతి
  • 37 టెస్టులు, 42 వన్డేలు ఆడిన యశ్ పాల్ 
  • జాతీయ సెలక్టర్ గా కూడా బాధ్యతలను నిర్వహించిన శర్మ

టీమిండియా మాజీ క్రికెటర్ యశ్ పాల్ శర్మ కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఢిల్లీలో ఆయన మృతి చెందారు. 1983లో జరిగిన ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న కపిల్ దేవ్ సేనలో శర్మ కూడా ఒక్కరు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. యశ్ పాల్ మన మధ్య లేడని... ఆయన కుటుంబసభ్యుల నుంచి ఇప్పుడే సమాచారం అందిందని యశ్ పాల్ గత టీమ్మేట్ ఒకరు తెలిపారు.

అంతర్జాతీయ క్రికెట్ లో శర్మ 37 టెస్టులు, 42 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 1,606 పరుగులు, వన్డేల్లో 883 రన్స్ సాధించారు. 1983 ప్రపంచకప్ లో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచుల్లో యశ్ పాల్ సాధించిన హాఫ్ సెంచరీ ఒక క్లాస్ అని భారత క్రికెట్ అభిమానులు భావిస్తుంటారు. 2000 ప్రారంభంలో యశ్ పాల్ జాతీయ సెలక్టర్ గా కూడా బాధ్యతలను నిర్వహించారు. ఆయన మృతి పట్ల పలువురు క్రికెటర్లు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

  • Loading...

More Telugu News