Sanchaita Gajapathi Raju: మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై పిటిషన్లు.. విచారణకు కోర్టు అంగీకారం

Counsel appeals to set aside judgment of single judge in Mansas Trust case

  • నిన్నటి కేసుల జాబితాలో ప్రభుత్వం వేసిన రెండు అప్పీళ్లు మాత్రమే విచారణకు
  • మిగతా వాటితో కలిపి విచారించాలని కోరిన ప్రభుత్వ, సంచయిత న్యాయవాదులు
  • అంగీకరించిన న్యాయస్థానం
  • రెండు వారాలు వాయిదా

సింహాచలం దేవస్థానం బోర్డు చైర్ పర్సన్‌గా, మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యురాలిగా, ట్రస్ట్ చైర్ పర్సన్‌గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో చెల్లదంటూ ఈ ఏడాది జూన్‌లో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అయితే, ఈ తీర్పును కొట్టివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం మూడు అప్పీళ్లు దాఖలు చేయగా, సంచయిత మరో మూడు అప్పీళ్లను దాఖలు చేశారు.

ఈ క్రమంలో నిన్నటి కేసుల జాబితాలో ప్రభుత్వం వేసిన రెండు అప్పీళ్లు మాత్రమే విచారణకు వచ్చాయి. మిగిలిన అప్పీళ్లతో కలిపి ఈ రెండింటినీ కూడా విచారించాలని ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సంచయిత తరపు న్యాయవాది అల్తాఫ్ ఫాతిమాలు కోర్టును కోరారు. వారి అభ్యర్థనను అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News