PCB: వాహన కాలుష్య పరీక్షల ఫలితాలు ఇక ఆన్‌లైన్‌లోకి.. పరీక్ష ఆలస్యమైతే భారీ జరిమానా

Telangana PCB tighten norms

  • వాహన కాలుష్య నిబంధనలు మరింత కఠినతరం
  • ప్రత్యేక దృష్టిసారించిన ‘ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ కమిటీ’
  • కాలుష్య నియంత్రణ పరీక్ష ఒక్క రోజు ఆలస్యమైనా భారీ జరిమానా

తెలంగాణలో వాహన కాలుష్య నియంత్రణ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. ఇకపై వాహన కాలుష్య పరీక్షలు చేసిన వెంటనే ఆ వివరాలు, ఫలితం ఆన్‌లైన్‌లోకి వెళ్లిపోతాయి. రవాణాశాఖ, పోలీస్ శాఖకూ చేరుతాయి. ఆరు నెలల గడువులోపు మళ్లీ కాలుష్య పరీక్ష చేయించకపోతే భారీ జరిమానా చెల్లించుకోకతప్పదు. ఆగస్టు నుంచి అంటే వచ్చే నెల నుంచే ఈ విధానం అమల్లోకి రాబోతోంది.

రాష్ట్రంలోని వాయుకాలుష్యంలో 50 శాతానికిపైగా వాహనాల నుంచే వస్తుండడంతో ఈ విషయంపై ‘ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ’ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ కమిటీలో పీసీబీ, రవాణా, పోలీసులు, పురపాలక తదితర శాఖలు ఉన్నాయి. తొలుత ఈ విధానాన్ని హైదరాబాద్‌లో అమలు చేస్తారు. ఆపై రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల వాహనాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచే రోజుకు 1,500 టన్నుల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నట్టు పీసీబీ గణాంకాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News