Raghu Rama Krishna Raju: పదవీ విరమణ వయస్సు తగ్గించాలన్న ఆలోచనను విరమించుకోవాలి!: జగన్‌కు రఘురామ లేఖ
- ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు తగ్గిస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి
- ఆ పరిస్థితిని తలుచుకుని తన మనసు వికలం అయిందన్న రఘురామ
- గ్రామ సర్పంచ్ ల అధికారాలను వీఆర్వోలకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవో సరికాదు
- హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలి
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నవ సూచనలు (విధేయతతో) పేరుతో ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ రోజు ఏడో లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు తగ్గించాలన్న మీ ఆలోచనను విరమించుకోవాలని, గ్రామ సర్పంచ్ ల అధికారాలను వీఆర్వోలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ఈ లేఖలో ఆయన కోరారు.
పదవీ విరమణ అంటే పని చేసే ప్రదేశం నుంచి విరామం తీసుకుని ఆ ఉద్యోగి నూతన జీవితాన్ని మొదలు పెట్టడం అని రఘురామ అన్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే ఆదాయం ఎంతో గణించుకుని వారు తమ శేష జీవితాన్ని ఆనందంగా గడిపే ఉత్తర క్షణాలని ఆయన చెప్పారు. ఇలాంటి అంశంలో జగన్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని వదంతుల రూపంలో వార్తలు వస్తున్నాయని, ఆ పరిస్థితిని తలుచుకుని తన మనసు వికలం అయిందని రఘురామ చెప్పుకొచ్చారు.
రఘురామ రాసిన మూడు పేజీల లేఖ..