Sensex: మొదట్లో నష్టాల్లోకి జారుకుని... చివరికి లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 134 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 41 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.76 శాతం పెరిగిన టెక్ మహీంద్రా షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ఆ తర్వాత ఐటీ స్టాకులకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 134 పాయింట్లు లాభపడి 52,904కి చేరుకుంది. నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 15,853 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (2.76%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.09%), ఇన్ఫోసిస్ (2.07%), ఎల్ అండ్ టీ (2.05%), టాటా స్టీల్ (1.28%).
టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-1.32%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.81%), నెస్లే ఇండియా (-0.76%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.74%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.65%).