COVID19: కొవిడ్ బాధితుల్లో దీర్ఘకాలిక సమస్యలు.. 203 లక్షణాలు!

Long Covid has more than 200 symptoms

  • బ్రిటన్‌ యూనివర్సిటీ చేసిన వెబ్ ఆధారిత సర్వే 
  • మొత్తం 3,762 మంది నుంచి సమాధానాలు
  • ఏడు నెలలపాటు వేధించనున్న 66 లక్షణాలు

కొవిడ్ వచ్చి తగ్గినా దాని సమస్యలు మాత్రం దీర్ఘకాలం వేధిస్తాయని తాజా పరిశోధనలో తేలింది. శరీరంలోని 10 అవయవ వ్యవస్థల్లో 203 లక్షణాలు ఉత్పన్నమవుతున్నట్టు బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజీ లండన్ పరిశోధకులు గుర్తించారు. కరోనా అనంతరం సమస్యలు ఎదుర్కొంటున్న బాధితుల వ్యాధి లక్షణాలను వెబ్ ఆధారిత సర్వే ద్వారా వర్గీకరించారు.

మొత్తం 56 దేశాలకు చెందిన 3,762 మంది నుంచి సమాధానాలు రాబట్టారు. ఇందులో భాగంగా మొత్తం 203 లక్షణాలను గుర్తించారు. వీటిలో 66 లక్షణాలు ఏడు నెలలపాటు కొనసాగినట్టు శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. వీరు గుర్తించిన లక్షణాల్లో అలసట, మానసిక సమస్యలు, కొద్దిపాటి శ్రమకే విపరీతంగా అలసిపోవడం, చిత్తభ్రమలు, గుండెలో దడ, చర్మంపై దురద, మూత్రాశయ నియంత్రణ సమస్యలు, జ్ఞాపకశక్తి మందగించడం, చూపు మసకబారడం, డయేరియా వంటి సమస్యలతోపాటు మహిళల రుతుక్రమంలో మార్పులు, లైంగిక సమస్యలు వంటివి ఉన్నాయి.

  • Loading...

More Telugu News