Jagan: జగన్ బెయిలు రద్దయితే ఏమవుతుందో చెప్పిన సీపీఐ నారాయణ
- రఘురామరాజు పార్లమెంటు సభ్యత్వం మాత్రం రద్దవుతుంది
- జగన్ బెయిలు రద్దు చేయాలని పిటిషన్ వేయడం తప్పే
- జగన్ మరోమారు జైలుకు వెళ్తే అర్ధాయుష్షు కాస్తా పూర్ణాయుష్షు అవుతుంది
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బెయిలు రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్ వేయడం తప్పేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. జగన్ బెయిలు రద్దు అవుతుందో, లేదో తెలియదు కానీ రఘురామరాజు పార్లమెంటు సభ్యత్వం మాత్రం రద్దవుతుందని జోస్యం చెప్పారు. రఘురామ కోసం ఏపీలో బలమైన వైసీపీని బీజేపీ వదులుకోదని నారాయణ అన్నారు.
రఘురామరాజు కోరుకున్నట్టు బెయిలు రద్దయి జైలుకు వెళ్లినా జగన్‌కు వచ్చే నష్టం ఏమీ ఉండదన్నారు. గతంలో 16 నెలలు జైలులో ఉన్న జగన్ ఆ సానుభూతితో ఎన్నికల్లో గెలిచారని, మరోసారి జైలుకు వెళ్తే ఆయన అర్ధాయుష్షు కాస్తా పూర్ణాయుష్షుగా మారుతుందని నారాయణ వ్యాఖ్యానించారు.