Telangana: ఖానామెట్​ భూముల వేలంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

High Court Issues Interim Orders On Khanamet Land Auction

  • ప్లాట్ 17పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం
  • ఉత్తర్వులకు లోబడే వేలం ఉండాలని టీఎస్ఐఐసీకి సూచన
  • తమ పూర్వీకుల సమాధులున్నాయంటూ నలుగురి పిటిషన్

హైదరాబాద్ ఖానామెట్ భూముల వేలంపై హైకోర్టు స్పందించింది. అందులోని ప్లాట్ నం.17పై నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్లాట్ లోని భూముల్లో తమ పూర్వీకుల సమాధులున్నాయని పేర్కొంటూ దానిపై జరిగిన వేలాన్ని నిలుపుదల చేయాల్సిందిగా నలుగురు స్థానికులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

నిన్న జరిగిన వేలంలో 14.9 ఎకరాలకుగానూ తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)కి రూ.729 కోట్ల ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆ నలుగురు వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. ప్లాట్ 17పై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తుది ఉత్తర్వులకు లోబడే వేలం ఉండాలని టీఎస్ఐఐసీని ఆదేశించింది. విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News