Roja: ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి నుంచి రోజా తొలగింపు.. మంత్రిగా అవకాశం దక్కేనా?

Roja terminated as APIIC Chairperson

  • రోజా స్థానంలో ఏపీఐఐసీ చైర్మన్ గా మెట్టు గోవిందరెడ్డి
  • త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం
  • రోజాకు కేబినెట్ లో అవకాశం ఉండొచ్చని అంచనాలు

నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగించారు. ఆమె స్థానంలో ఏపీఐఐసీ చైర్మన్ గా మెట్టు గోవిందరెడ్డిని నియమించారు. ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉండకూడదనే సీఎం జగన్ నిర్ణయంలో భాగంగా ఆమెను పదవి నుంచి తొలగించారు. రోజాతో పాటు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా కూడా నామినేటెడ్ పదవులను కోల్పోయారు.

మరోవైపు రెండో విడత కేబినెట్ విస్తరణలో రోజాకు మంత్రి పదవి లభిస్తుందని ఆమె అనుచరులు ఆశలు పెట్టుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత 80 శాతం మంత్రులను తొలగిస్తానని... కొత్త వారికి అవకాశం కల్పిస్తానని గతంలోనే జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విస్తరణలో రోజాకు అవకాశం లభించే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మరి ఏం జరగబోతోందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News