Theaters: తెలంగాణలో థియేటర్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి... ప్రభుత్వం అనుమతి
- కరోనా వ్యాప్తితో మూతపడ్డ సినిమా హాళ్లు
- మంత్రి తలసానిని కలిసిన ఫిలిం చాంబర్ ప్రతినిధులు
- సినిమాటోగ్రఫీ మంత్రికి వినతిపత్రం సమర్పణ
- సానుకూలంగా స్పందించిన తలసాని
- రేపట్నించి థియేటర్ల రీఓపెనింగ్
తెలంగాణలో సినిమా ప్రదర్శనలపై ప్రభుత్వం ఆంక్షలు తొలగించింది. 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో రేపటి నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. అయితే, కొత్త చిత్రాలను ఈ నెల 23 నుంచి ప్రదర్శించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాలు సినిమా ప్రదర్శనలు పునః ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
ఇవాళ తెలంగాణ ఫిలించాంబర్ ప్రతినిధులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసానిని కలిసి థియేటర్ల ఓపెనింగ్ పై వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఫిలిం చాంబర్ ప్రతినిధుల విజ్ఞప్తుల పట్ల తలసాని సానుకూలంగా స్పందించారు.