Corona Virus: కరోనా రోగులు టీబీ పరీక్షలు చేయించుకోండి... నూతన మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

New guidelines from Union health ministry

  • దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • తగ్గిన టీబీ అవగాహన ప్రచారం
  • టీబీ కేసులు పెరుగుతున్నాయంటూ కథనాలు
  • టీబీ రోగులు కరోనా పరీక్షలు చేయించుకోవాలన్న కేంద్రం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా రోగులు విధిగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని, అదే విధంగా టీబీ రోగులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో భారత్ లో క్షయ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం స్పందించింది. టీబీ కేసులను, కొవిడ్ కేసులను గుర్తించడంలో రాష్ట్రాలు మెరుగైన రీతిలో పరిశీలన చేపట్టాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సూచించింది.

ఇక, కొవిడ్ కారణంగా టీబీ కేసులు పెరుగుతున్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. అయితే, కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్ సోకుతున్నట్టుగానే, బాధితులు టీబీ బారినపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనా వ్యాప్తి భారత్ లో ప్రారంభం కాకముందు జాతీయస్థాయిలో టీబీ వ్యతిరేక కార్యక్రమాలు ఉద్ధృతంగా సాగేవి. అయితే, కరోనా రాకతో టీబీ అవగాహన ప్రచారం మందగించింది.

  • Loading...

More Telugu News