Haryana: హర్యానా డిప్యూటీ స్పీకర్‌ కారుపై దాడి ఘటన.. అధికారులతో రైతుల చర్చలు విఫలం

Protesting farmers held for sedition in Sirsa raids

  • హర్యానా డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వా కారుపై గత వారం దాడి
  • వంద మంది రైతులపై రాజద్రోహం కేసు
  • చర్చలు విఫలం కావడంతో రైతుల నిరవధిక ధర్నా

రాజద్రోహం కేసులు ఎదుర్కొంటున్న రైతులకు, హర్యానా అధికారులకు మధ్య నిన్న జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సరిగ్గా వారం రోజుల క్రితం సిర్సాలో బీజేపీ నేత, హర్యానా డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వా కారుపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి 100 మంది రైతులపై రాజద్రోహం సహా వివిధ అభియోగాలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు రైతులను అరెస్ట్ చేశారు.

రైతులపై రాజద్రోహం కేసులు నమోదు చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఈ కేసుల విషయమై నిన్న 20 మంది రైతుల బృందం జిల్లా అధికారులతో రెండు గంటలపాటు చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలమైనట్టు రైతు నేతలు తెలిపారు. చర్చలు విఫలం కావడంతో రైతులు అక్కడి మినీ సచివాలయం వద్ద నిరవధిక ధర్నాకు దిగారు.

  • Loading...

More Telugu News