KTR: జాతీయ పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో రాసేలా అనుమతివ్వండి: కేంద్రాన్ని కోరిన మంత్రి కేటీఆర్

KTR wrote union minister Jitendra Singh

  • హిందీ, ఇంగ్లీషు భాషల్లో జాతీయ పోటీ పరీక్షలు
  • ప్రాంతీయ భాషల్లో చదివిన వారికి నష్టమన్న కేటీఆర్
  • గతంలో ఇదే అంశంపై కేసీఆర్ లేఖ
  • కేసీఆర్ లేఖ అంశాన్ని కూడా ప్రస్తావించిన కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయస్థాయి పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో రాసేలా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే నిర్వహిస్తున్నారని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారని కేటీఆర్ వివరించారు. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకునేవరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వొద్దని తన లేఖలో కోరారు.

కాగా, గతంలో సీఎం కేసీఆర్ కూడా ఇవే అంశాలను ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు హిందీ, ఇంగ్లీషు భాషల్లో నిర్వహిస్తున్నందున ప్రాంతీయ భాషల్లో చదువుకున్న విద్యార్థులు నష్టపోతున్నారని ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకోని విద్యార్థులకు, హిందీయేతర రాష్ట్రాల విద్యార్థులకు ఈ విషయంలో అన్యాయం జరుగుతోందని వివరించారు. దేశవ్యాప్తంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News