New Delhi: 7 సెంటీమీటర్ల వానకే మునిగిన ఢిల్లీ.. బస్సులు, కార్లు నీట మునక

Heavy Rains Lashes Delhi As Buses and Cars Sub Merged

  • 2015 నుంచి ఇదే ఎక్కువన్న అధికారులు
  • చాలా ప్రాంతాలు జలమయం
  • ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 7 సెంటీమీటర్ల వానకే చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రహ్లాద్ పూర్ లో బస్సులు నీట మునిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. 2015 నుంచి ఒక్కరోజులో నమోదైన వర్షపాతాల్లో ఇదే ఎక్కువని అధికారులు చెబుతున్నారు. అంతకుముందు 1958 జులై 21లో నమోదైన 22.6 సెంటీమీటర్ల వర్షపాతమే ఇప్పటివరకు రికార్డ్ అని నిపుణులు అంటున్నారు.

హోలీ ఫ్యామిలీ హాస్పిటల్, జామియా యూనివర్సిటీ, ఐటీవో జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ల మీదే కార్లు మునిగిపోయాయి. ప్రహ్లాద్ పూర్ అండర్ పాస్ లో నీళ్లు నిలవడం వల్ల అక్కడ బస్సు, మినీ బస్సు చిక్కుకుపోయాయి. ‘‘మేం ఫరీదాబాద్ వెళుతున్నాం. కానీ, ఇప్పుడు ఎక్కడకూ వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ వరదలతో చితికిపోతున్నాం. 25 ఏళ్లుగా ఇదే సమస్య వేధిస్తోంది’’ అని ఓ స్థానికుడు చెప్పారు.

ఇక, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మహిపాల్ పూర్ అండర్ పాస్ వద్ద కూడా బస్సులు చిక్కుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అంతటా మేఘావృతమై ఉంది. దీంతో మరికొన్ని గంటల పాటు ఉరుములతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడే ముప్పుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • Loading...

More Telugu News