ECB: భారత్ ను ఢీకొట్టే ఇంగ్లండ్ బలగం రెడీ.. తొలి రెండు టెస్టులకు జట్టు ప్రకటన
- 17 మందికి అవకాశం
- స్టోక్స్, బెయిర్ స్టో, బట్లర్, కరన్ పునరాగమనం
- ఆర్చర్, క్రిస్ వోక్స్ లకు దక్కని చోటు
- వచ్చే నెల 4 నుంచి సిరీస్ మొదలు
వచ్చే నెల 4 నుంచి భారత్ తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ తన జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు బరిలోకి దిగబోయే 17 మంది బలగాన్ని ప్రకటించింది. బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో, శామ్ కరన్ లు తిరిగి జట్టులోకి వచ్చారు. గాయం కారణంగా న్యూజిలాండ్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు స్టోక్స్ దూరమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తో సిరీస్ లో టెస్టు అరంగేట్రం చేసిన ఓలీ రాబిన్సన్ కూ అవకాశం ఇచ్చారు. హసీబ్ హమీద్ కు జట్టులో స్థానం దక్కింది.
అయితే, మోచెయ్యి, మడమ గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ వంటి స్టార్ బౌలర్లకు అవకాశం దక్కలేదు. ప్రకటించిన జట్టుకు జో రూట్ సారథ్యం వహించనున్నాడు. తొలి టెస్ట్ ఆగస్టు 4న నాటింగ్ హాంలోని ట్రెంట్ బ్రిడ్జ్ లో మొదలుకానుంది.
ఇదీ టీం: జో రూట్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్ స్టో, డామ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రాలీ, శామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, డామ్ సిబ్లీ, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్.