Suresh Raina: వివాదాస్పదమైన రైనా వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు

Suresh Rainas Iam Also Brahmin comments sparks
  • తమిళనాడు ప్రీమియర్ లీగ్ కు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న రైనా
  • తమిళ సంస్కృతి గురించి చెప్పమన్న సహచర కామెంటేటర్
  • నేను కూడా బ్రాహ్మిణే అనుకుంటున్నా అన్న రైనా
టీమిండియా మాజీ కెప్టెన్ సురేశ్ రైనా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. రైనా చేసిన ఒక వ్యాఖ్య అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు ప్రీమియర్ లీగ్ కు సురేశ్ రైనా కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. నిన్న ఒక మ్యాచ్ సందర్భంగా కామెంటరీ చెపుతూ అక్కడి సంస్కృతిపై నోరు జారాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్న రైనాను తమిళ సంస్కృతి గురించి చెప్పమని సహచర కామెంటేటర్ అడిగాడు.
 
ఈ నేపథ్యంలో రైనా స్పందిస్తూ... 'నేను కూడా బ్రహ్మిణే అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నైకి ఆడుతున్నా. నా టీమ్ మేట్లను, తమిళనాడు సంస్కృతిని ఎంతో ఇష్టపడుతున్నా' అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తమిళనాడు అంటే కేవలం బ్రాహ్మణులే ఉంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇన్నేళ్ల నుంచి చెన్నైకి ఆడుతున్నప్పటికీ... ఇక్కడి నిజమైన సంస్కృతిని చూసినట్టు లేవని విమర్శిస్తున్నారు.
Suresh Raina
Chennai
Tamil Nadu
Brahmini

More Telugu News