India: దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్ వ్యవహారంలో పాకిస్థాన్ పై భారత్, ఆఫ్ఘనిస్థాన్ ఆగ్రహం

India and Afghanistan slams Pakistan
  • ఇస్లామాబాద్ లో ఆఫ్ఘన్ దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్
  • భారత్ పై ఆరోపణలు చేసిన పాక్ మంత్రి
  • అనవసరంగా లాగుతున్నారన్న భారత్
  • పాక్ బాధ్యత లేకుండా మాట్లాడుతోందన్న ఆఫ్ఘన్
పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో ఆఫ్ఘనిస్థాన్ దౌత్యవేత్త కుమార్తెను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పాల్జేసిన వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది. దీనిపై భారత్, ఆఫ్ఘనిస్థాన్ తీవ్రంగా స్పందించాయి. పాకిస్థాన్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయి. ఓ దౌత్యవేత్త కుమార్తె కేసును ఇలాగేనా పర్యవేక్షించేది? అంటూ మండిపడ్డాయి.

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి మాట్లాడుతూ... భారత్ ఈ వ్యవహారంలో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించాల్సి వస్తోందని అన్నారు. పాక్ హోంమంత్రి రషీద్ అహ్మద్ అనవసరంగా భారత్ ను ఈ వ్యవహారంలోకి లాగారని ఆరోపించారు. భారత నిఘా వర్గాల కుట్ర వల్లే ఆఫ్ఘన్ దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్ జరిగిందని రషీద్ అహ్మద్ అంటున్నారని, అందుకే తాము ఈ విషయంలో స్పందిస్తున్నామని ఆరిందమ్ బాగ్చి తెలిపారు. పాకిస్థాన్ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

అటు, ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడింది. ఇస్లామాబాద్ లో ఆఫ్ఘన్ దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్ జరిగినట్టు ఆధారాలు లేవని వ్యాఖ్యానించడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య అపనమ్మకానికి దారితీస్తాయని పేర్కొంది.
India
Afghanistan
Pakistan
Kidnap
Envoy
Dughter
Islamabad

More Telugu News