India: జ‌మ్మూక‌శ్మీర్‌లో డ్రోన్‌ క‌ల‌క‌లం.. కూల్చేసిన భద్రతా దళాలు

india shot down drone

  • కనాచక్‌ ప్రాంతంలో ఘ‌ట‌న‌
  • డ్రోన్‌లో ఐదు కిలోల పేలుడు పదార్థాలు
  • స్వాధీనం చేసుకున్న అధికారులు

జ‌మ్మూక‌శ్మీర్‌లో మ‌రోసారి ఓ డ్రోన్‌ క‌ల‌క‌లం రేపింది. దీంతో దాన్ని భ‌ద్ర‌తా దళాలు కూల్చేశాయి. డ్రోన్‌లో పేలుడు పదార్థాలు ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ ఘ‌ట‌న ఈ రోజు తెల్ల‌వారుజామున‌ కనాచక్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. డ్రోన్‌లో ఐదు కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయ‌ని, వాటిని స్వాధీనం చేసుకున్నామ‌ని అధికారులు ప్ర‌క‌టించారు.

ఈ డ్రోన్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. 2019 నుంచి పాక్ భార‌త్‌లోకి డ్రోన్ల ద్వారా పేలుడు ప‌దార్థాలు, డ్ర‌గ్స్ పంపే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. ఇటీవ‌ల జమ్మూ ఎయిర్‌ బేస్‌లో చోటు చేసుకున్న డ్రోన్‌ దాడి నేపథ్యంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు డ్రోన్ల‌పై నిఘా పెంచాయి.   

డ్రోన్ల‌ను రాడార్లు, యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్ సాయంతో గుర్తించి పాక్ చ‌ర్య‌ల‌ను భార‌త సైన్యం తిప్పికొడుతోంది. కొన్ని డ్రోన్లు త‌ప్పించుకుని వెన‌క్కి వెళ్లిపోతున్నప్ప‌టికీ కొన్నింటిని మాత్రం భార‌త సైన్యం కూల్చేయ‌గ‌లుగుతోంది. డ్రోన్ల ద్వారా జ‌రిగే దాడుల‌ను ముందుగానే ప‌సిగ‌ట్టి తిప్పి కొట్టేందుకు ఏర్పాటు చేసుకుని అప్ర‌మ‌త్తంగా ఉంది.

  • Loading...

More Telugu News