Karnataka: కరోనా ఆంక్షలను మరింత సడలించిన కర్ణాటక
- ప్రార్థనా స్థలాలను తెరిచేందుకు అనుమతి
- అమ్యూజ్ మెంట్ పార్కులకు కూడా గ్రీన్ సిగ్నల్
- 26 నుంచి ఉన్నత విద్యా సంస్థలను పునఃప్రారంభించేందుకు అనుమతి
కరోనా కేసులు కొంత మేర తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ ఆంక్షలను కర్ణాటక ప్రభుత్వం మరింత సడలించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు తదితర అన్ని ప్రార్థనా స్థలాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. రేపటి నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు మీద ప్రకటన విడుదలయింది.
అమ్యూజ్ మెంట్ పార్కులను కూడా తెరుచుకోవచ్చని... అయితే కొవిడ్ గైడ్ లైన్స్ ను మాత్రం కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే వాటర్ స్పోర్ట్స్, నీటికి సంబంధించిన అడ్వెంచర్ యాక్టివిటీలకు మాత్రం అనుమతి లేదని తెలిపింది. ఇంతకు ముందు జులై 18న కర్ణాటక ప్రభుత్వం సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతించింది. జులై 19 నుంచి రాత్రి కర్ఫ్యూ సమయాన్ని తగ్గించింది. ఈ నెల 26 నుంచి ఉన్నత విద్యా సంస్థలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.