Rahul Gandhi: ప్రజల జీవితాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి: రాహుల్ గాంధీ
- వ్యాక్సినేషన్ పూర్తికావడానికి నిర్దిష్టమైన గడువు లేదని ప్రభుత్వం చెప్పింది
- మోదీ ప్రభుత్వానికి సామర్థ్యం లేదు
- దేశంలో వ్యాక్సిన్లు ఎక్కడ?
దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ను ఎప్పుడు పూర్తి చేస్తారన్న విషయంపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. వ్యాక్సినేషన్ పూర్తికావడానికి నిర్దిష్టమైన గడువు ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఓ వార్తా కథనాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోస్ట్ చేస్తూ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మోదీ ప్రభుత్వానికి సామర్థ్యం లేదనడానికి, వెన్నెముక లేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ప్రజల జీవితాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడానికి గడువు ఏమీ లేదని కేంద్ర సర్కారు చెబుతోందని ఆయన గుర్తు చేశారు. మరి వ్యాక్సిన్లు ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు.
కాగా, వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి నిర్దిష్ట గడువు ఏదీ లేదని చెప్పడంతో పాటు వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్న దేశాల్లో భారత దేశం కూడా ఉందని కేంద్ర సర్కారు నిన్న తెలిపింది.