Alla Ramakrishna Reddy: దుగ్గిరాల మండలాన్ని రూ. 400 కోట్లతో అభివృద్ధి చేసేందుకు సీఎం ఆమోదం తెలిపారు: ఆర్కే

MLA RK thanks Jagan
  • బకింగ్ హామ్ రోడ్డును నాలుగు లైన్లుగా మార్చడానికి ఆమోదం తెలిపారు
  • రూ. 200 కోట్లతో ఈ పనులు ప్రారంభం కానున్నాయి
  • త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది
బకింగ్ హామ్ కెనాల్ రోడ్డును నాలుగు లైన్లుగా మార్చడానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. రూ. 200 కోట్లతో ఈ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. తెనాలి నుంచి మంగళగిరి నేషనల్ హైవే రోడ్డు వరకు రోడ్డును విస్తరిస్తారని తెలిపారు. త్వరలోనే ఈ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుందని చెప్పారు.

అలాగే, దుగ్గిరాల మండలాన్ని రూ. 400 కోట్లతో అభివృద్ధి చేయడానికి జగన్ ఆమోదం తెలిపారని ఆర్కే తెలిపారు. దుగ్గిరాల మండలంలోని 18 గ్రామాల్లో రూ. 70 నుంచి 80 కోట్లతో తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో కూడా పలు అభివృద్ధి పనులకు సీఎం ఆమోదం తెలిపారని... వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
Alla Ramakrishna Reddy
Jagan
YSRCP

More Telugu News