Ashok Gajapathi Raju: మాన్సాస్ ట్రస్టు ఈవో సహకరించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు
- మాన్సాస్ ట్రస్టులో మరోసారి భగ్గుమన్న విభేదాలు
- ట్రస్టు ఈవోకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన అశోక్ గజపతి
- ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదని ఆరోపణ
- పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు
మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలు మరోసారి రచ్చకెక్కాయి. మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు సహకరించడంలేదని మాన్సాస్ ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్టు ఈవో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడంలేదని పిటిషన్ లో తెలిపారు. అశోక్ గజపతిరాజు పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్ ను సీజేకి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దాన్ని ఏ బెంచ్ విచారణ జరపాలలేది సీజే నిర్ణయిస్తారని పేర్కొంది. రేపు ఆదివారం కావడంతో ఈ పిటిషన్ సోమవారం నాడు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.