Rajasthan: పంజాబ్​ సమస్య తీరింది.. ఇక, రాజస్థాన్​ లో దిద్దుబాటు!.. చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్

Congress Rejig Rajasthan Cabinet

  • ఈ నెల 28న మంత్రివర్గ విస్తరణ
  • పార్టీ నేతలతో కె.సి. వేణుగోపాల్, అజయ్ మాకెన్ సమావేశం
  • కేబినెట్ విస్తరణ ఆలస్యంపై పైలట్ ఆగ్రహం

పార్టీలోని అసంతృప్తులను చల్లార్చే పనిలో పడింది కాంగ్రెస్. వివాదాలకు చెక్ పెట్టి సహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పంజాబ్ లో సీఎం అమరీందర్ సింగ్, నవ్ జోత్ సింగ్ సిద్ధూల మధ్య నెలకొన్న ఘర్షణలకు తెరదించింది. పంజాబ్ పీసీసీ చీఫ్ పగ్గాలను సిద్ధూకు అప్పగించి ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చింది. తాజాగా, రాజస్థాన్ పై ఆ పార్టీ దృష్టి సారించింది.

సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ నేత సచిన్ పైలట్ మధ్య వివాదాలను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటిదాకా మంత్రి వర్గ విస్తరణ చేయకపోవడంపై సచిన్ పైలట్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో.. ఈనెల 28న కేబినెట్ ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో ఇవాళ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, రాజస్థాన్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ అజయ్ మాకెన్ లు.. పీసీసీ సభ్యులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.


జులై 28న ఎమ్మెల్యేలంతా జైపూర్ లోనే ఉండాలని ఆదేశాలిచ్చారు. ఢిల్లీకి వెళ్లే ముందు సీఎం అశోక్ గెహ్లాట్ తోనూ వారిద్దరు సమావేశమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే శనివారం ఆయనతో వారిద్దరు భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలో గెహ్లాట్, పైలట్ వర్గాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News